News December 22, 2024
ఘోర ప్రమాదం.. 38 మంది మృతి

ఆఫ్రికా దేశం కాంగోలోని బుసిరా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతయ్యారు. సుమారు 400 మంది ఫెర్రీలో క్రిస్మస్ వేడుకల కోసం స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Similar News
News November 6, 2025
మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

బోరాన్‌ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్‌ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 6, 2025
నైట్ స్కిన్ కేర్ ఇలా..

పగలంతా అలసిపోయిన చర్మం రాత్రివేళ తనని తాను రిపేర్ చేసుకుంటుంది. ఏదైనా స్కిన్ ట్రీట్మెంట్ చెయ్యాలన్నా ఇదే సరైన సమయం. ఇందుకోసం యాంటీఆక్సిడెంట్స్ ఉన్న నైట్ క్రీమ్ అప్లై చేయాలి. ఇవి వయసుని పెంచే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. కళ్ల కింద ఉబ్బు వస్తుంటే కెఫీన్ ఉన్న ఐక్రీమ్స్ అప్లై చెయ్యాలి. వాజిలీన్/ కొబ్బరి నూనెను చేతులకు, పాదాలకు అప్లై చేసి గ్లౌవ్స్, సాక్స్ వేసుకుని పడుకుంటే ఉదయానికి మృదువుగా మారతాయి.
News November 6, 2025
చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆలోచనను CBN మార్చుకునేలా ఉద్యమాలు చేపట్టాలని YS జగన్ YCP విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై ‘రచ్చబండ’ ద్వారా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ‘ఈ ఉద్యమాలు ఎలా ఉండాలంటే CBNకు షాక్ తగిలేలా ఉండాలి. ఫీజు రీయింబర్స్‌మెంటుపై కూడా డిసెంబర్ వరకు టైమ్ ఇస్తాం. ఆ తరువాత ఉద్యమం చేస్తాం’ అని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విద్యార్థి విభాగం ఉండాలన్నారు.


