News October 18, 2025

ఘోర ప్రమాదం… 8 మంది భక్తుల మృతి

image

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్ వద్ద పికప్ వ్యాను లోయలో పడి 8మంది భక్తులు మరణించారు. ఇష్టదైవం అస్తంబా దేవీయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వ్యాను ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. వ్యాను తునాతునకలు కాగా భక్తులు వాహనం కింద పడిపోయారు. 8మంది అక్కడికక్కడే మరణించగా మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యంత వేగంతో వెళ్తూ డ్రైవర్ పట్టుకోల్పోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.

Similar News

News October 18, 2025

ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ.. దీపావళి కానుక ప్రకటిస్తారా?

image

AP: మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సీఎం వారితో చర్చిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం ఏదైనా కానుక అందిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై కాసేపట్లో సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.

News October 18, 2025

కో–ఆపరేటివ్​ బ్యాంకుల్లో 225 ఉద్యోగాలు

image

TG: జిల్లా–కోఆపరేటివ్​ బ్యాంకుల్లో(DCCB) స్టాఫ్​ అసిస్టెంట్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి హైదరాబాద్​, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్​, మెదక్​, వరంగల్​ జిల్లాల్లో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమై నవంబర్​ 6న ముగియనుంది. వయసు 18-30 ఏళ్లు. డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి నోటిఫికేషన్​ వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News October 18, 2025

కల్తీ మద్యం కేసు: ప్రధాన నిందితుడితో జోగి రమేశ్ ఫొటోలు!

image

AP: కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, అతడి సోదరుడు జగన్మోహన్ రావుతో మాజీ మంత్రి జోగి రమేశ్ కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. ఓ వేడుకలో వీరు పక్కపక్కనే కూర్చున్నారు. కాగా జనార్దన్‌తో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని రమేశ్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు రమేశ్ ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారు చేశామని జనార్దన్ వెల్లడించడం గమనార్హం.