News October 20, 2024
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

రాజస్థాన్లోని ధోల్పుర్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి టెంపోను స్లీపర్ బస్సు ఢీకొన్న ఘటనలో 12 మంది మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మృతుల బంధువులు ఆరోపించారు. వీరంతా వివాహ వేడుకకు హాజరై వస్తున్నట్లు తెలిపారు. బస్సు వేగానికి ఆటో నుజ్జునుజ్జయింది.
Similar News
News December 8, 2025
కర్నూలు: హలో యువత మేలుకో పోస్టర్ విడుదల

కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో-చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు నాగరాజు, నాయకులు చంటి, దస్తగిరి పాల్గొన్నారు.
News December 8, 2025
విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారా?

శ్రీవారితో పాటు ఆలయ గోపురంపై ఉన్న విమాన వేంకటేశ్వరుడికీ అంతే ప్రత్యేకత ఉంటుందని చాలామంది భక్తులకు తెలిసుండదు. తిరుమలకు వెళ్లినవారు ఇరువురినీ తప్పక దర్శించుకోవాలని <<18475056>>పురోహితులు<<>> సూచిస్తున్నారు. ఆనంద నిలయంపై వాయవ్య మూలన వెండి మకర తోరణంతో ఉన్న మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విమాన వేంకటేశ్వరుడి విగ్రహం ఉంటుంది. 16వ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ విగ్రహం వద్ద ధ్యానం చేసి మోక్షం పొందారని ప్రతీతి.
News December 8, 2025
వికసిత్ భారత్లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

TG: 2047 వికసిత్ భారత్లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్తో పనిచేస్తోంది’ అని చెప్పారు.


