News March 16, 2024
తిమ్మాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సుమారు 10 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుర్తుతెలియని కారు అతడిని బలంగా ఢీ కొట్టిడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 3, 2025
KNR: గిరిజన యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమం

కరీంనగర్ జిల్లా గిరిజన యువతీ యువకులకు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని క్యారక్టేరైజేషన్ ప్రాజెక్టులో శిక్షణ కల్పించనున్నారు. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కింద ఈ శిక్షణ జరుగుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. ఇంజినీరింగ్ లేదా ఎంఎస్సీ చేసిన వారు అర్హులు. దరఖాస్తు కోసం https://www.cense.iisc.ac.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
News September 3, 2025
KNR: ప్రభుత్వ భూములు పరిరక్షించాలి: కలెక్టర్

KNR రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమికి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లోని అనధికార కట్టడాలను తొలగించాలన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, రాతి కడీలు, సూచిక బోర్డులు చేసి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
News September 2, 2025
KNR: పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని DMHO ఆకస్మిక తనిఖీ

DMHO డా. వెంకటరమణ, పీఓ ఎంసీహెచ్ డా. సన జవేరియాతో కలసి మోతాజ్ ఖానా పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రం యొక్క హాజరు పట్టిక, అసంక్రమిత వ్యాధులైన అధిక రక్తపోటు డయాబెటిస్ రోగుల రికార్డులను తనిఖీ చేశారు. పంపిణీ చేస్తున్న మందుల వివరాలను పరిశీలించారు. పేషంట్లు అందరూ ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.