News August 25, 2025
లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News August 25, 2025
AP, TGకి 18,900 మెట్రిక్ టన్నుల యూరియా

ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయించింది. దీని వల్ల యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది.
News August 25, 2025
వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.
News August 25, 2025
ఇన్‌స్టా చూడటమే ఉద్యోగం!

కొందరు ఎక్కువసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటుంది. ముంబైకి చెందిన మాంక్ ఎంటర్టైన్మెంట్ ‘డూమ్ స్క్రోలర్’ పేరిట ఉద్యోగ అవకాశాన్ని ఇస్తోంది. సదరు ఉద్యోగి ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం 6 గంటల సమయం గడుపుతూ ట్రెండింగ్ అంశాలు, వైరల్ కంటెంట్‌ను గుర్తించాలి. వీరికి హిందీ & ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.