News September 30, 2024

‘బురారీ’ తరహాలోనే తండ్రి, నలుగురు కూతుళ్లు ఆత్మహత్య!

image

2018లో ఢిల్లీ బురారీలోని ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. తాజాగా దేశ రాజధానిలోని వసంత్‌కుంజ్‌లో తండ్రి, నలుగురు కూతుళ్లు సూసైడ్ చేసుకున్నారు. ఇది కూడా బురారీ ఘటన తరహాలో తాంత్రిక పూజల్లో భాగంగానే జరిగిందనే అనుమానాలొస్తున్నాయి. వారి మెడ, మణికట్టుకు ఎరుపు, పసుపు దారాలను పోలీసులు గుర్తించారు. వారంతా విషం కలిపిన స్వీట్లను తిన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 29, 2025

కశ్మీర్‌లో బౌద్ధం: ఫ్రాన్స్ మ్యూజియం ఫొటోల్లో 2000 ఏళ్ల చరిత్ర

image

ఫ్రాన్స్ మ్యూజియంలోని కొన్ని పాత ఫొటోలు కశ్మీర్ 2000 ఏళ్ల నాటి బౌద్ధ చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. జెహన్‌పొరాలో జరిగిన తవ్వకాల్లో పురాతన బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా ఉండేదని ప్రధాని మోదీ తాజా ‘మన్ కీ బాత్‌’లో చెప్పారు. ఒకప్పుడు సిల్క్ రూట్ ద్వారా కంధార్ వరకు విస్తరించిన బౌద్ధ నెట్‌వర్క్‌లో కశ్మీర్ కీలక పాత్ర పోషించిందని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.

News December 29, 2025

సైన్యంలో అవినీతి.. టాప్ జనరల్స్‌పై వేటు వేసిన జిన్‌పింగ్

image

చైనా సైన్యంలో అగ్రశ్రేణి అధికారులే అవినీతికి పాల్పడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ముగ్గురు కీలక సైనిక అధికారులపై పార్లమెంట్ బహిష్కరణ వేటు వేసింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ విభాగాల అధిపతులు వాంగ్ రెన్‌హువా, వాంగ్ పెంగ్‌తో పాటు ఆర్మ్‌డ్ పోలీస్ అధికారి జాంగ్ హాంగ్‌బింగ్‌ను పదవుల నుంచి తొలగించారు. సైన్యంలో ప్రక్షాళనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

News December 29, 2025

NHIDCLలో 48 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (<>NHIDCL<<>>)లో 48 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, Sr జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com/