News March 16, 2024

పోటీలో తండ్రీకొడుకులు

image

వైసీపీ అభ్యర్థుల్లో రెండు కుటుంబాల తండ్రీకొడుకులకు టికెట్లు దక్కాయి. పుంగనూరు ఎమ్మెల్యేగా కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఇక ఇదే తరహాలో ఈయన కొడుకు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా తిరిగి బరిలో నిలుస్తారని పార్టీ ప్రకటించింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు MP స్థానం, ఆయన కొడుకు మోహిత్- చంద్రగిరి MLA టికెట్లు పొందారు.

Similar News

News March 7, 2026

భవిష్యత్‌లో అనేక దేశాలకు భారత్ విద్యుత్: సీఎం

image

AP: అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని CM CBN తెలిపారు. డిప్లమసీ, ఫ్లెక్సిబిలిటీలో మనవాళ్లకు మంచి పేరుందన్నారు. ITలో ఇండియన్స్ పరిజ్ఞానం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘సంస్కరణల వల్లే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ దూసుకెళ్తోంది. మన దేశం భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ అందిస్తుంది’ అని జోస్యం చెప్పారు.

News March 7, 2026

సుందర్ పిచాయ్ జీతం రూ.6,361 కోట్లు!

image

గూగుల్ CEO సుందర్ పిచాయ్ శాలరీ ప్యాకేజీ భారీగా పెరిగింది. వచ్చే మూడేళ్ల కాలానికి $692 మిలియన్ల(రూ.6,361 కోట్లు)ను అందుకోనున్నారు. ఇందులో వార్షిక జీతం, రిస్ట్రిక్టెడ్ స్టాక్ వెస్టింగ్, అనుబంధ సంస్థల్లో షేర్ల వాటా కలిసి ఉంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్యాకేజీ తీసుకుంటున్న సీఈవోలలో ఒకరుగా నిలిచారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. కాగా 2004లో గూగుల్‌లో చేరిన సుందర్ 2015లో సీఈవో అయ్యారు.

News March 7, 2026

సెంటిమెంట్.. హోటల్‌ను మార్చిన టీమ్ఇండియా

image

T20 WC విజేతగా నిలిచేందుకు టీమ్ఇండియా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దృష్టిలో ఉంచుకొని, సెంటిమెంట్ పరంగా ఆ టైమ్‌లో బస చేసిన ITC నర్మదలో కాకుండా తాజ్ స్కై లైన్‌కు బస మార్చేసింది. అహ్మదాబాద్‌లో రేపు న్యూజిలాండ్‌తో ఫైనల్ జరగనుండగా చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఇటీవల చంద్రగ్రహణం టైమ్‌లోనూ జట్టు ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే.