News January 24, 2025
తండ్రి రికార్డును బద్దలుకొట్టాడు

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టు తరఫున అతిపిన్న వయసు(16 ఏళ్ల 291 రోజులు)లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచారు. గతంలో ఈ రికార్డ్ అతడి తండ్రి ఆండ్రూ(20 ఏళ్ల 18 రోజులు) పేరిట ఉండేది. ఆండ్రూ 1998లో కెన్యాపై సెంచరీ చేయగా 26 ఏళ్ల తర్వాత రాకీ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్పై ఈ రికార్డ్ సాధించారు.
Similar News
News November 18, 2025
BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.

తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.