News August 5, 2025

ముగ్గురు ఆడపిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య

image

తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురంలో దారుణం జరిగింది. ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, కొడుకును గదిలో బంధించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అప్పుల కారణంగానే కూతుళ్లను హతమార్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News August 5, 2025

YS వివేకా హత్య కేసు విచారణ పూర్తి: సీబీఐ

image

AP: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పూర్తయిందని CBI సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ మరోసారి ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. వివేకా కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారించింది. కానీ వివేకా కేసు వాదిస్తున్న లాయర్ గైర్హాజరు కావడంతో విచారణను పాస్ ఓవర్ చేసింది. మరోసారి ఈ కేసుపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

News August 5, 2025

పూర్తి నివేదిక వస్తే అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం: హరీశ్ రావు

image

TG: కాళేశ్వరంపై పూర్తి నివేదిక బయటపెడితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హరీశ్ రావు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనే కాళేశ్వరం అక్రమాలు అంటూ తప్పుడు నివేదికలు తీసుకొచ్చారని ఆరోపించారు. నిన్నటి నివేదిక అబద్ధాలు, రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా ఉందని ఫైరయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పాలనను సీఎం రేవంత్ గాలికి వదిలేశారన్నారు.

News August 5, 2025

APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలో 42 ఏపీపీ (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులకు ఏదైనా డిగ్రీతోపాటు లా సర్టిఫికెట్ ఉండాలి. ఇంటర్ తర్వాత లా పూర్తి చేసినవారు కూడా అర్హులే. క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి. 42 ఏళ్లలోపువారు అర్హులు. OC, BC అభ్యర్థులు రూ.600, SC, ST అభ్యర్థులు రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. SEP 7లోగా <>slprb.ap.gov.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.