News November 10, 2024
పిల్లలతో కలిసి చెరువులో దూకి తండ్రి ఆత్మహత్య

TG: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. తేలు సత్యం(50) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తండ్రితో పాటు అభంశుభం తెలియని చిన్నారులు అశ్విన్, త్రివర్ణ విగతజీవులుగా కనిపించడం కలిచివేసింది.
Similar News
News September 15, 2025
ఫ్లో దెబ్బతింటుందనే పాటలు పెట్టలేదు: మిరాయ్ డైరెక్టర్

మిరాయ్ మూవీలో వైబ్ ఉంది బేబీ సాంగ్‌తోపాటు నిధి అగర్వాల్‌తో చేసిన ఓ పాటను కూడా మేకర్స్ పక్కన పెట్టేశారు. దీనిపై డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని స్పందించారు. మూవీ ఫ్లో దెబ్బతింటుందనే ఈ సాంగ్స్ పెట్టలేదని చెప్పారు. నిధి అగర్వాల్ పాట షూట్ చేసింది ఫస్ట్ పార్ట్ కోసం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అది రెండో పార్ట్ కోసమే తీసినట్లు హింట్ ఇచ్చారు. అయితే ‘వైబ్ ఉంది బేబీ’ పాటపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదు.
News September 15, 2025
కాలేజీల బంద్‌పై సస్పెన్స్

TG: ప్రైవేట్ కాలేజీల బంద్ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. అయితే బంద్‌పై కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. కళాశాలల మూసివేతను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించలేదు. దీంతో బంద్‌పై <<17712331>>సస్పెన్స్<<>> కొనసాగుతోంది. అన్ని కాలేజీలు మూసివేస్తామని ఈ భేటీకి ముందు యాజమాన్యాలు స్పష్టం చేశాయి.
News September 15, 2025
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!

AP: అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వానలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయంది.