News July 11, 2024
తండ్రికి రూ.40 కోట్ల ఆస్తులు.. OBC నాన్-క్రిమిలేయర్ కింద IAS పోస్టింగ్!

మహారాష్ట్రకు చెందిన IAS ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఆమె తండ్రికి రూ.40 కోట్ల (మార్కెట్ విలువ రూ.100 కోట్లు) ఆస్తులు ఉన్నా ఆమె OBC నాన్-క్రిమిలేయర్ కోటాలో ఉద్యోగానికి ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దివ్యాంగురాలిగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. అయితే తాను తల్లిదండ్రులతో విడిపోయినట్లు పూజ మాక్ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
Similar News
News November 15, 2025
ICMRలో 28 పోస్టులు

<
News November 15, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ
News November 15, 2025
మరో కీలక మావో లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.


