News August 24, 2024

తండ్రయిన స్టార్ సింగర్ జస్టిన్ బీబర్

image

కెనడియన్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్, హేలీ బీబర్ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బీబర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. కొడుకు పాదాల ఫొటోను పంచుకుంటూ అతని పేరు జాక్ బ్లూస్ అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. జూనియర్ బీబర్ వచ్చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ‘బేబీ’ సాంగ్‌తో జస్టిన్ లక్షలాది మంది భారత అభిమానులను సొంతం చేసుకున్నారు.

Similar News

News April 1, 2026

SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..

image

ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.00 గంటల నుంచి 11.45 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్‌ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.

News April 1, 2026

నైట్‌షిఫ్టులతో క్యాన్సర్ ముప్పు: వైద్యులు

image

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసే నర్సులు, పోలీసులు, డ్రైవర్లు, టెకీలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘దీని వల్ల జీవ గడియారం దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీనివల్ల మహిళల్లో రొమ్ము, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. నిరంతర నైట్ షిఫ్టులను WHO క్యాన్సర్ కారకంగా గుర్తించింది’ అని వారు వివరిస్తున్నారు.

News April 1, 2026

IPL: ఇది గమనించారా?

image

IPL-19 సీజన్‌లో నిన్నటి వరకు 4 మ్యాచులు జరిగాయి. అన్నింటిలోనూ హోం టీమ్‌లు, అదీ ఛేజింగ్ చేసిన జట్లే గెలవడం గమనించారా? తొలి 2 మ్యాచు(SRH-RCB, KKR-MI)ల్లో 200+ లక్ష్యాలను ఈజీగా ఛేదించారు. ఇక CSK-RR మధ్య లోస్కోరింగ్ గేమ్ జరిగింది. చెన్నై 127 రన్స్ చేయగా ప్రత్యర్థి జట్టు 12.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. నిన్న GT-PBKS మధ్య జరిగిన మ్యాచ్ కాస్త ఉత్కంఠ రేపినా చివరి ఓవర్ తొలి బంతికి పంజాబ్ గెలిచింది.