News January 15, 2025
ప్రేమించిందని పోలీసుల ముందే కూతురిని చంపిన తండ్రి

MPకి చెందిన మహేశ్ గుర్జార్ తన కూతురు తనూ(20)కు మరో 4 రోజుల్లో పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. ఇంతలో తాను విక్కీ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబీకులు ఒప్పుకోవడంలేదంటూ తనూ SMలో ఓ వీడియో పెట్టింది. విషయం పోలీసులకు, గ్రామస్థులకు తెలియడంతో నచ్చజెప్పేందుకు పంచాయితీ పెట్టారు. ఈక్రమంలోనే తండ్రీకూతురు మధ్య వాగ్వాదం జరగడంతో అందరి ముందే తనూను మహేశ్ కాల్చి చంపాడు.
Similar News
News November 22, 2025
WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వ్యయం పెంపులో అక్రమాలు?

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అంచనా వ్యయం భారీగా పెంచినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్ధారించింది. అనుమతులు లేకుండా గత ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో వ్యయాన్ని రూ.625 కోట్లకు పైగా పెంచినట్టు నివేదికలో తేలింది. ఇదే సమయంలో ఆస్పత్రి భూ అక్రమాలు, జైలు భూముల తాకట్టు అంశాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చినా.. విజిలెన్స్ నివేదిక పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వం చర్యలను నిలిపివేసింది.
News November 22, 2025
‘నక్క’ బుద్ధి చూపించింది!.. భారతీయుల ఆగ్రహం

ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ క్రికెట్ ఛానల్‌పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో మ్యాచ్ అయితే ఒకలా, ఆస్ట్రేలియాలో అయితే మరోలా మాట్లాడుతోందని అంటున్నారు. యాషెస్ టెస్టులో తొలి రోజు 19 వికెట్లు పడ్డాయంటూ గొప్పగా రాసుకొచ్చింది. అయితే ఇటీవల INDvsSA టెస్టు మ్యాచ్‌లో ఒకేరోజు 15 వికెట్లు పడటంపై “RIP TEST CRICKET” అంటూ పేర్కొంది. దీంతో ‘నక్క’ బుద్ధి చూపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు.
News November 22, 2025
AP న్యూస్ అప్డేట్స్

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.


