News December 28, 2024

నితీశ్ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్న తండ్రి❤️

image

ఆస్ట్రేలియాపై నితీశ్ సెంచరీ శ్రమ వెనుక ఆయన తండ్రి ముత్యాల రెడ్డి కష్టం ఎంతో ఉంది. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందూస్థాన్ జింక్ లో ఆయన ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలోనే ఉదయ్‌పూర్‌కు బదిలీ కాగా నితీశ్ క్రికెటర్ కావాలన్న కల నెరవేరదనే ఆలోచనతో మరో ఐదేళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులను నితీశ్ కోచింగ్ కు వెచ్చించారు. ఈక్రమంలోనే ఎన్నో ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు.

Similar News

News November 17, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 118 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 118 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

News November 17, 2025

2026 JANలో HYD-విజయవాడ NH విస్తరణ

image

TG: HYD-విజయవాడ NH65 విస్తరణ పనులు 2026 JANలో ప్రారంభం కానున్నాయి. 6 లేన్లుగా దీని విస్తరణకు DPR ఖరారైంది. పనులకు టెండర్లనూ పిలిచారు. ఈ నెలాఖరున ఇవి ఫైనల్ అవుతాయి. దాదాపు ₹10,000 CRతో 231 KMమేర విస్తరణ చేస్తారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ROBలు, అండర్‌పాస్‌లు కూడా హైవే విస్తరణ పనులలో భాగంగా ఉంటాయి. హైవే విస్తరణలో 33 ప్రధాన జంక్షన్లు, 105 చిన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తారని అధికారులు తెలిపారు.