News April 16, 2025

తండ్రయిన జహీర్ ఖాన్

image

టీమ్ ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య సాగరిక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. జహీర్, సాగరిక 2017లో పెళ్లి చేసుకున్నారు.

Similar News

News April 16, 2025

‘రాజీవ్ యువ వికాసం’ నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్: భట్టి

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లు ముందుకు వస్తే యువత ఆర్థికంగా ఎదుగుతారని, రూ.6వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగిసింది.

News April 16, 2025

గురూజీకి తమిళ హీరో షాక్?

image

అల్లు అర్జున్-అట్లీ సినిమా ఖరారు కావడంతో ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేయడంపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తమిళ హీరో శివకార్తీకేయన్‌కు ఆయన కథ చెప్పగా రెమ్యునరేషన్ రూ.70 కోట్లు అడిగినట్లు సమాచారం. ఇంత అమౌంట్ వెచ్చిస్తే వర్కౌట్ కాదని త్రివిక్రమ్ ఆసక్తి కనబరచనట్లు టాక్. దీంతో ప్రస్తుతం ఆ సినిమాను చేయట్లేదని తెలుస్తోంది. మరోవైపు వెంకీకి గురూజీ కథ చెప్పగా ఆయన ఓకే చెప్పాల్సి ఉంది.

News April 16, 2025

అమిత్‌షా కుట్ర వల్లే బెంగాల్‌లో హింస: మమత

image

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో హింస చెలరేగేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. BSF బలగాలు బంగ్లాదేశ్ ఆగంతకులను దేశంలోకి చొరబడేలా అనుమతించాయన్నారు. అమిత్‌‌షా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంపై ప్రయోగించకుండా ప్రధాని నియంత్రించాలని కోరారు. కాగా ఈ నిరసనల్లో ముగ్గురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు.

error: Content is protected !!