News May 4, 2024
తండ్రీకొడుకులకు చుక్కెదురు

సంచలనం సృష్టిస్తున్న సెక్స్ వీడియోల కేసులో తండ్రీకొడుకులకు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్ నోటీసు జారీ అయింది. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది.
Similar News
News March 25, 2026
పెట్రోల్ కోసం తిరుగుతుంటే ట్యాంక్ ఖాళీ!

తెలంగాణలో కొన్నిచోట్ల పెట్రోల్ కోసం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కొన్ని బంకులు మూసేయగా, తెరిచి ఉన్న కొన్నింటి వద్ద భారీ క్యూలు కన్పిస్తున్నాయి. దీంతో మరోచోటుకు తిరుగుతూ ఎండలో నీరసించడంతో పాటు బండిలో ఉన్న కొద్దిపాటి పెట్రోల్ కూడా అయిపోతోందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెబుతున్నా బయట పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
News March 25, 2026
అలా చేస్తే పంత్ ఆట మెరుగవుతుంది: డుప్లెసిస్

LSG కెప్టెన్ పంత్ టెస్టుల్లాగే T20ల్లోనూ తన ఆటకు సంబంధించి ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలని మాజీ క్రికెటర్ డుప్లెసిస్ సూచించారు. ‘T20ల్లో మెరుగ్గా ఎలా ఆడాలో పంత్ ఒక గేమ్ ప్లాన్ కనుక్కోవాలి. ప్రతి బాల్ గురించి ముందుగానే ఆలోచించొద్దు. తొలి 6 బంతులు ఆయన ఎలా ఆడతారనేదే ముఖ్యం. నంబర్స్ పరంగా ఆయన ఇంకా హై ఇంపాక్ట్ చూపించాలని కోరుకుంటున్నా’ అని జియో హాట్‌స్టార్ IPL లైవ్ షోలో వ్యాఖ్యానించారు.
News March 25, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షం!

TG: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎండ తగ్గుముఖం పట్టింది.


