News March 29, 2024

పిల్లల కోసం తండ్రులు జంప్!

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో BRSలో కీలకంగా ఉన్న నాయకులు సైతం ఇతర పార్టీలకు జై కొడుతున్నారు. ఫిరాయింపులు నచ్చకపోయినా వారి పిల్లల కోసమే పార్టీ వీడుతున్నారట. కుమార్తె కావ్య కోసం కడియం శ్రీహరి, కూతురు విజయలక్ష్మి కోసం కేకే, తనయుడు భరత్ కోసం పోతుగంటి రాములు పార్టీని వీడారు. అయితే, కాంగ్రెస్‌ని వీడకుండా అంటిపెట్టుకున్న జానారెడ్డి విజయం సాధించారు. తన వారసుల్లో ఒకరిని MLA చేయగా.. మరొకరికి MP సీటు లభించింది.

Similar News

News April 3, 2026

రేపటి నుంచి రబీ కొనుగోళ్లు.. 8 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు: నాదెండ్ల

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ‘1,917 కేంద్రాల ద్వారా 23 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం. రైతుల కోసం 5.40 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాం. 17,262 వాహనాలు అందుబాటులో ఉంటాయి. ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల్లోపే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం’ అని SMలో పోస్టు చేశారు.

News April 3, 2026

‘వీరభద్రుడు’గా సూర్య.. రిలీజ్ ఎప్పుడంటే?

image

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో సూర్య మీసం మెలేసి చేతిలో కత్తి పట్టుకొని ఉన్నారు. మే 14న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News April 3, 2026

PHOTOS: భూమి ఎంత అందంగా ఉందో చూడండి

image

‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్లూ, బ్రౌన్ రంగుల వెలుగుల్లో అద్భుతంగా ప్రకాశిస్తున్న భూమి ఫొటోలను నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు చంద్రుని వైపు ప్రయాణిస్తుండగా స్పేస్ క్రాఫ్ట్‌లోని విండో నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు పేర్కొంది. నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన రాకెట్ ఈ నెల 2న నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.