News March 4, 2025

ప్రమాదకరంగా ఫ్యాటీ లివర్.. ఇలా చేయాల్సిందే

image

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ పట్టి పీడిస్తున్న సమస్య కాలేయపు కొవ్వు(ఫ్యాటీ లివర్). ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మద్యపానం వంటి అలవాట్లు, అధిక బరువు వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. జంక్ ఫుడ్, డ్రింక్స్‌ను దూరం పెట్టడం.. పోషకాహారం, వారానికి కనీసం 135 నిమిషాల వ్యాయామం దీనికి పరిష్కారాలని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గడంతోపాటు గుడ్డు, చేపల్ని ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు.

Similar News

News March 4, 2025

రోహిత్ ఈ సారైనా టాస్ గెలువు: ఆకాశ్ చోప్రా

image

రోహిత్‌శర్మ ఈసారైనా టాస్ గెలవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోరారు. ఆసీస్‌తో మ్యాచ్‌‌లో టాస్ పాత్ర కీలకం కానుందని తన యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. ఈ పిచ్‌లపై ఛేజింగ్ చాలా కష్టమని, సెమీస్‌లో టాస్‌ గెలవటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడినప్పటికీ మ్యాచులలో గెలిచింది. అయితే రోహిత్ శర్మ వరుసగా 10సార్లు టాస్ ఓడి రికార్డు సృష్టించారు.

News March 4, 2025

దిశvsశక్తి.. మండలిలో వాడీవేడీ చర్చ

image

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను తొలగించడంపై మండలిలో YCP MLC వరుదు కళ్యాణి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని దుయ్యబట్టారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు సవిత, అనిత కౌంటరిచ్చారు. చట్టబద్ధత లేని దిశ గురించి ఆమె మాట్లాడుతున్నారని, ఆ యాప్‌తో ఎంతమంది మహిళలను రక్షించారని ప్రశ్నించారు. తాము నెట్‌వర్క్ లేని చోట కూడా పనిచేసేలా శక్తి యాప్‌ను మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తామని తెలిపారు.

News March 4, 2025

నేడు ప్రపంచ ఊబకాయ దినోత్సవం

image

మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన మహమ్మారి ఊబకాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ 2015 నుంచి మార్చి 4ను ఊబకాయ అవగాహనా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనం ఊబకాయంతో బాధపడుతున్నట్లు అంచనా. మధుమేహం, గుండె జబ్బులు, బీపీ, లివర్, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, ఎముకల అనారోగ్యాలకు ఊబకాయం కారణమవుతోంది.

error: Content is protected !!