News June 17, 2024
‘నాన్ క్యాష్ పేమెంట్స్’కే మొగ్గు

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వాడే భారతీయులు నాన్ క్యాష్ పేమెంట్స్‌కే మొగ్గు చూపుతున్నారు. క్యాష్(భౌతిక నగదు)కు బదులుగా UPI, డెబిట్, క్రెడిట్ కార్డు, డిజిటల్ వ్యాలెట్స్‌తో పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆరేళ్ల క్రితం 20.4%గా ఉన్న నాన్ క్యాష్ పేమెంట్స్ ఇప్పుడు ఏకంగా 58.1%కి చేరింది. ఈ పేమెంట్స్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో చైనా ముందుండగా, ఆ తర్వాత ఇండియా, ఇండోనేషియా ఉన్నట్లు 2023 నివేదికలు చెబుతున్నాయి.
Similar News
News September 14, 2025
‘నానో బనానా’ మాయలో పడుతున్నారా?

‘నానో బనానా’ మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్లో షేర్ చేయొద్దని TGSRTC MD సజ్జనార్ సూచించారు. ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాల్లోని డబ్బంతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని ట్వీట్ చేశారు. ‘ట్రెండింగ్స్‌ల్లో మీ ఆనందాన్ని పంచుకోవచ్చు. కానీ భద్రతే తొలి ప్రాధాన్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ఫేక్ సైట్లలో పర్సనల్ డేటా అప్లోడ్ చేసేముందు ఆలోచించాలి. మీ డేటా.. మీ డబ్బు.. మీ బాధ్యత’ అని తెలిపారు.
News September 14, 2025
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ సోనారిక

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక శుభవార్త చెప్పారు. తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు SMలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సోనారిక తెలుగులో జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో నటించారు. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకున్నారు.
News September 14, 2025
ఇతర భాషలకు హిందీ శత్రువు కాదు.. మిత్రుడు: అమిత్ షా

దేశంలో హిందీ భాషను ఇతర భాషలకు ముప్పుగా చూడొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ ఇతర భాషలకు శత్రువు కాదని, మిత్రుడు అని హిందీ దివస్ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘ఇందుకు గుజరాత్ పెద్ద ఉదాహరణ. ఇక్కడ గుజరాతీ మాట్లాడిన గాంధీ, దయానంద, వల్లభాయ్ పటేల్, KM మున్షి వంటి ఉద్ధండులు హిందీని ప్రోత్సహించారు. వందేమాతరం, జైహింద్ లాంటి నినాదాలు భాషా మేల్కొలుపు నుంచే ఉద్భవించాయి’ అని వ్యాఖ్యానించారు.