News April 13, 2024

ఎన్నారైపై ఎఫ్‌బీఐ రూ.2 కోట్ల రివార్డు

image

అమెరికాలో ఓ ఎన్నారై ఆచూకీ తెలిపిన వారికి రూ.2 కోట్ల రివార్డు ఇస్తామని అక్కడి దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించింది. 2015, ఏప్రిల్ 2న భద్రేశ్ పటేల్ అనే వ్యక్తి, మేరీల్యాండ్‌లో తన భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపి పరారయ్యాడు. అప్పటి నుంచీ అతడి కోసం గాలిస్తున్న ఎఫ్‌బీఐ, భద్రేశ్‌ను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చి తాజాగా రూ. 2కోట్ల రివార్డును అతడి తలపై ప్రకటించింది.

Similar News

News March 18, 2026

‘ధురంధర్-2’ పబ్లిక్ టాక్

image

‘ధురంధర్-2’ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు Xలో రివ్యూలు ఇస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ అదిరిపోయిందని, రణ్‌వీర్ సింగ్ నటన, ఇంటర్వెల్ అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ ఆదిత్య ధార్ 4 గంటల సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించారని చెబుతున్నారు. హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉన్నా దేశభక్తి సినిమా కాబట్టి జస్టిఫై చేసేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
*Way2News ఫుల్ రివ్యూ రేపు ఉదయం..

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (1/2)

image

నాలుగు రాష్ట్రాలు, ఓ యూటీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన వేళ మరోసారి మహిళా ఓటర్ల డామినేషన్ చర్చనీయాంశమైంది. 2025 బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ఉమెన్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అస్సాంలో 1.25Cr (49.97%), బెంగాల్‌లో 3.16Cr (49%), TNలో 2.89Cr (51.07%), కేరళంలో 1.38Cr (51%), పుదుచ్చేరి 5.3లక్షలు (53%) మహిళా ఓటర్లు ఉన్నారు.

News March 18, 2026

మహిళా ఓటర్ల ఫేవర్ ఎవరికో? (2/2)

image

మహిళలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు కాబట్టే WBలో మమతా సర్కార్‌‌ ఇచ్చిన లక్ష్మిర్ భండార్ స్కీమ్‌కు కౌంటర్‌గా ₹5700Cr ప్యాకేజ్, అన్నపూర్ణ యోజనతో నెలకు ₹3వేలు ఇస్తామని BJP ప్రకటించింది. TNలో నెలకు ₹2500, ఆడశిశువులకు గోల్డ్ రింగ్ వంటి హామీలొచ్చాయి. కేరళంలో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అస్సాంలో మహిళా సంఘాలే తమ డిమాండ్స్‌పై మ్యానిఫెస్టో ప్రకటించాయి. మరి మహిళలు గేమ్ ఛేంజర్‌గా మారతారో చూడాలి.