News February 14, 2025

FDPలు బోధన సిబ్బందికి ఎంతో ఉపయోగపడతాయి: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయాన్ని గురువారం వాధ్వానీ ఫౌండేషన్‌ వారు సందర్శించారు. అనంతరం జేఎన్టీయూలో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను(FDP) నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ వీసీ హెచ్.సుదర్శన రావు మాట్లాడుతూ.. విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బోధన సిబ్బందికి FDPలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య పాల్గొన్నారు.

Similar News

News February 20, 2025

గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత

image

అనంతపురం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం గుంతకల్లులో రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

News February 20, 2025

ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులకు అస్వస్థత

image

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలోని ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న నలుగురు విద్యార్థినులను వెంటనే అనంతపురం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

News February 20, 2025

ATP: గుండెపోటుతో లారీలోనే డ్రైవర్ మృతి

image

యాడికి మండలం వేములపాడు సమీపంలో లారీలో నిద్రిస్తున్న డ్రైవర్ నరసింహులు నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. యల్లనూరు మండలం గొడ్డుమర్రికి చెందిన నరసింహులు లారీలో గ్రానైట్ తీసుకొని కర్ణాటకకు బయలుదేరాడు. నిద్ర రావడంతో వేములపాడు సమీపంలో లారీ ఆపి క్యాబిన్‌లోనే నిద్రపోయాడు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

error: Content is protected !!