News February 10, 2025

కేజ్రీలో భయం: పంజాబ్ CM, MLAలతో భేటీ?

image

పంజాబ్ CM భగవంత్ మాన్, ఎమ్మెల్యేలతో AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు ఢిల్లీలో సమావేశం అవుతారని తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 30కి పైగా MLAలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్, BJP నేతలు బాహాటంగానే చెప్తున్నారు. పైగా శాంతిభద్రతలు, టెర్రరిజం, డ్రగ్ మాఫియా అంతంపై అమిత్ షా డైరెక్షన్లో మాన్ పనిచేస్తున్నారు. దీంతో కేజ్రీకి చీలిక భయం పట్టుకుంది.

Similar News

News November 9, 2025

ఇదే జోరు కొనసాగితే 2027కి పోలవరం పూర్తి: అతుల్ జైన్

image

AP: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతున్నాయని పీపీఏ సీఈవో అతుల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో పనులను, టెస్టింగ్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. అలాగే నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు నిధుల ఢోకా లేదని, ఇదే జోరు కొనసాగితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు.

News November 9, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో 110 పోస్టులు

image

<>BOB<<>> క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ వివిధ జోన్లలో 110 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 30వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఇ మెయిల్ careers@bobcaps.in ద్వారా అప్లై చేసుకోవాలి.

News November 9, 2025

మనిషికి సంస్కారం ఎందుకు ఉండాలి? అదెలా వస్తుంది?

image

శరీర మలినాన్ని స్నానం తొలగించినట్లే, జీవులకు అంటిన అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి, సద్గుణాలు ప్రసాదించేదే నిజమైన సంస్కారం. ఈ కర్మ బాహ్య శుద్ధి కాదు, ఆత్మ శుద్ధి. మనస్సుకు, బుద్ధికి జ్ఞానంతో సంస్కారం చేయడం ద్వారానే మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు. ఆచారాలు, సత్కర్మల ద్వారా మనసును సంస్కరించుకుని, ఉత్తమ జీవనం సాగించడమే మన లక్ష్యం. సంస్కారాన్ని తల్లిదండ్రులు, వేదాల పఠనంతో పొందవచ్చు. <<-se>>#VedikVibes<<>>