News March 12, 2025
భయమనేది నా రక్తంలోనే లేదు: విజయసాయి

AP: కాకినాడ పోర్టు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. ‘కావాలనే కొందరు నన్ను ఈ కేసులో ఇరికించారు. కేవీ రావుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆయనంటేనే నాకు అసహ్యం. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డే. కొందరు ఎదగడానికి నన్ను కిందకు లాగారు. భయమనేది నా రక్తంలోనే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News December 10, 2025
దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.
News December 10, 2025
ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

భారత పర్యటనలో మెస్సీ పలు ప్రాంతాలను చుట్టేయనున్నారు. ఈ నెల 13న కోల్కతాలో అడుగుపెట్టనున్న ఆయన సాయంత్రం HYD వస్తారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీ ఢిల్లీ చేరుకొని PM మోదీతో భేటీ అవుతారు. కాగా తొలిరోజు కోల్కతాలో తన అతిపెద్ద(70 అడుగుల) విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాల్సి ఉన్నా సెక్యూరిటీ కారణాలతో ఆ ప్రోగ్రామ్ను వర్చువల్గా నిర్వహిస్తున్నారు.
News December 10, 2025
దిగుబడి పెంచే నానో ఎరువులను ఎలా వాడాలి?

దశాబ్దాలుగా సాగులో ఘన రూపంలో యూరియా, DAPలను రైతులు వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూప నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటి వాడకం వల్ల ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90% గ్రహించి, దిగుబడి పెరిగి.. పెట్టుబడి, గాలి, నేల కాలుష్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. నానో ఎరువులను ఎలా, ఎప్పుడు, ఏ పంటలకు వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


