News March 22, 2024
ప్రధాని మోదీ కళ్లలో ఓటమి భయం కనిపిస్తోంది: స్టాలిన్

తిరుచిరాపల్లిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పీఎం కేర్స్ ఫండ్ వెనుక ఉన్న రహస్యాలను బయటపెడతాం. కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి బీజేపీకి ఓటమి భయం పట్టుకోవడమే కారణం. మోదీ కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రం కోసం తెచ్చినట్టు ప్రధాని ఒక్క స్కీమ్ పేరైనా చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 28, 2025
శంషాబాద్: సమతా స్ఫూర్తి కేంద్రంలో 30న ఈక్వాలిటీ రన్

శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రం వద్ద ఈనెల 30న ఈక్వాలిటీ రన్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో రన్ ఫర్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.హాఫ్ మారథాన్, 10కే, 5కే, 3కే విభాగాల్లో పరుగు ప్రారంభం అవుతుందన్నారు.
News November 28, 2025
4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా నిరసన తెలిపారు.
News November 28, 2025
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

అండాశయం (ఓవరీస్) నుంచి అండం గర్భసంచిలోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్స్ను ‘ఫెలోపియన్ ట్యూబ్స్’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండం గర్భసంచిలో బదులు ఈ ఫెలోపియన్ ట్యూబుల్లో పెరగడంతోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో, ఒక్కోసారి కడుపులో కూడా పెరగవచ్చు. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’గా వ్యవహరిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు తల్లికి ప్రాణాపాయం సంభవిస్తుంది.


