News March 30, 2025
పరీక్షల భయం.. అమ్మాయి ఆత్మహత్య

వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష ఒత్తిడి భరించలేక తమిళనాడు చెన్నైకి చెందిన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే మూడు సార్లు NEETలో ఫెయిల్ అయిన దేవదర్శిని.. మేలో మళ్లీ ఎగ్జామ్ రాసేందుకు ప్రిపేర్ అవుతోంది. తరచూ విఫలం అవుతుండటం, సమయం వృథా కావడం, కుటుంబ ఆర్థిక సమస్యలతో సతమతం అయిన ఆమె ఇవాళ ఉరేసుకుంది.
Similar News
News April 1, 2025
తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ స్ట్రీమింగ్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ OTT తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఇది అమెజాన్ ప్రైమ్ OTTలోకి రాగా, ఇవాళ్టి నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ లవ్ స్టొరీతో వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ మూవీలో ప్రియాంకా మోహన్ స్పెషల్ సాంగ్లో కనిపించారు.
News April 1, 2025
కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఉదయం 8.40 గంటల వరకు 53.98 శాతం మేర, 34 లక్షల మందికి పైగా నగదు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, ఇవాళ ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనుండగా, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నారు.
News April 1, 2025
కొత్త రేషన్ కార్డులు ఎందరికంటే?

TG: రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 1.26 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేయగా 4.32 లక్షల ఆర్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ జారీ ప్రక్రియ ఆలస్యమైనా జాబితాలో పేరుంటే రేషన్ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. మరోవైపు కొత్త కార్డుల ముద్రణ ఇంకా టెండర్ దశలోనే ఉంది. కాగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది.