News September 28, 2024
హైడ్రా భయం.. మహిళ ఆత్మహత్య

TG: కూకట్పల్లి పరిధిలో హైడ్రా భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా ఇళ్లు కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఉరేసుకుని చనిపోయారు. కాగా ప్రతి రూపాయి పోగేసి కట్టిన 3 ఇళ్లను ముగ్గురు కూతుళ్లకి కట్నంగా ఇచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు కూల్చేస్తామని చెప్పడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
Similar News
News January 29, 2026
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News January 29, 2026
మరణించిన వ్యక్తి కలలో వచ్చారా?

మరణించిన వ్యక్తులు కలలో కనిపించడం అశుభం కాదు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇది మనసులోని బలమైన జ్ఞాపకాలకు, వారిపై ఉన్న ప్రేమకు ప్రతిబింబం. మృతులు కలలో కనిపించడం అంటే మీ జీవితంలో ఓ దశ ముగిసి, కొత్త మార్పులు మొదలవుతున్నాయని అర్థం. కొన్నిసార్లు వారు మనల్ని మార్గదర్శనం చేయడానికి కూడా రావచ్చు. మనసులో ఒత్తిడి, అసంపూర్తి కోరికల వల్ల కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఆందోళన చెందక, మానసిక సంకేతంగా చూడటం మంచిది.
News January 29, 2026
చైనాలో 11 మందికి మరణశిక్ష అమలు

క్రూరమైన మింగ్ మాఫియా ఫ్యామిలీకి చెందిన 11 మంది కీలక సభ్యులకు చైనా కోర్టు విధించిన మరణశిక్షను తాజాగా అమలు చేశారు. హత్యానేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల నేరాల్లో వీరు దోషులుగా తేలడంతో సెప్టెంబర్ 2025లో జెజియాంగ్ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా వీళ్లు సుమారు $1.4 బిలియన్ల ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.


