News April 11, 2025
ఇంటర్ రిజల్ట్స్ భయం.. విద్యార్థి ఆత్మహత్య

AP: నంద్యాల జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యవారి కోడూరుకి చెందిన బిజ్జం సుధీశ్వర్ రెడ్డి(18) ఇటీవల ఫస్టియర్ ఎగ్జామ్స్ రాశాడు. రేపు ఫలితాలు రానుండగా, ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఉరివేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
☛ పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. మళ్లీ కష్టపడి చదివి పాసయ్యేందుకు ప్రయత్నించాలి.
Similar News
News April 18, 2025
రేవంత్.. మీ బాస్‌ల కేసుపై మౌనమెందుకు?: KTR

TG: నేషనల్ హెరాల్డ్ కేసుపై CM రేవంత్ ఎందుకు స్పందించడం లేదని BRS నేత KTR ప్రశ్నించారు. ‘ఓవైపు కాంగ్రెస్ నేతలంతా వీధుల్లో నిరసనలు తెలుపుతుంటే రేవంత్ మాత్రం తన బాస్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విషయంలో మౌనమెందుకు పాటిస్తున్నారు? నాకొక్కడికే ఇది తేడాగా అనిపిస్తోందా?’ అని Xలో సెటైర్ వేశారు. కాగా ఈ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చిన విషయం తెలిసిందే.
News April 18, 2025
IPL: ఆ టీమ్‌కు కెప్టెన్ దూరం?

ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌లో చేతులారా విజయాన్ని దూరం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సంజూ ఆ మ్యాచ్‌లో పక్కటెముకల నొప్పితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆయనకు స్కాన్స్ తీయించామని, రేపు LSGతో మ్యాచ్‌కు ఆడటం అనుమానమేనని RR వర్గాలు తెలిపాయి. దీంతో మరోసారి పరాగ్ కెప్టెన్సీ చేసే అవకాశముంది.
News April 18, 2025
కాలేయ ఆరోగ్యం: ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

శరీరంలోని మలినాల్ని శుభ్రం చేయడంలో లివర్‌దే ప్రధాన పాత్ర. అంతటి కీలకమైన లివర్లో ఏదైనా సమస్య తలెత్తితే కనిపించే కొన్ని లక్షణాలు:
-> కడుపునిండా తింటూ కంటినిండా నిద్రపోతున్నా నీరసంగానే అనిపిస్తుండటం, తరచూ కామెర్లు రావడం, కళ్లు, చర్మం పసుపురంగులో ఉండటం, విరోచనాల రంగులో మార్పు, పొట్టకు కుడివైపు పైన నొప్పి రావడం, వాంతులు, కాళ్లు-మడమల్లో వాపు ఉంటే లివర్ టెస్ట్ చేయించుకోవాలి.
*రేపు కాలేయ ఆరోగ్య దినోత్సవం