News December 23, 2024

FEB 1: సెలవు రోజైనా స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయ్

image

2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్‌కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.

Similar News

News December 23, 2024

హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని

image

AP: రేషన్ బియ్యం అక్రమాల కేసులో పోలీసుల నోటీసులను క్వాష్ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. రేపు దీనిపై కోర్టు విచారణ చేయనుంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని భార్య జయసుధ ఏ1గా ఉన్నారు. రేపు ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.

News December 23, 2024

మంచు మనోజ్ ఫిర్యాదులో సంచలన ఆరోపణలు!

image

TG: తన సోదరుడు విష్ణుతో పాటు ఆరుగురిపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్, విజయ్, కిరణ్, రాజ్‌తో పాటు శివల పేర్లను పేర్కొన్నారు. భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందన్నారు. మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీతో పాటు ట్రస్ట్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని పేర్కొన్నారు. తన ఇంటికి విద్యుత్, నీటి సరఫరా లేకుండా కుట్ర పన్నినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ కోసం హార్డ్ డిస్క్ దొంగిలించారని ఆరోపించారు.

News December 23, 2024

ఖేల్‌రత్నకు మను అర్హురాలు కాదా?

image

మనూ భాకర్.. భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్ సాధించిన స్టార్ షూటర్. ప్రపంచ వేదికపై తన ప్రదర్శనతో భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన ఆమె పేరును ఖేల్‌ర‌త్నకు నామినేట్ చేయలేదనే వార్తలు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. క్రీడ‌ల్లో అత్యున్న‌త ప్ర‌ద‌ర్శ‌నకుగానూ ప్ర‌దానం చేసే ఈ అవార్డుకు ఆమె అర్హురాలు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?