News February 4, 2025

FEB 10 వరకు MLC నామినేషన్ స్వీకరణ: ADB కలెక్టర్

image

తెలంగాణ గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల MLC ఎన్నికలకు సంబంధించి సోమవారం కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 9, 2025

కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

image

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.

News November 9, 2025

కామారెడ్డి: నేటి నుంచి కాలభైరవ స్వామి ఉత్సవాలు

image

రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలోని కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ప్రభు తెలిపారు. తొలి రోజు బద్ది పోచమ్మకు బోనాలు, సోమవారం లక్ష దీపార్చన, మంగళవారం డోలారోహణం, జన్మదినోత్సవం, బుధవారం రథోత్సవం, రక్షా యజ్ఞం, అగ్నిగుండాలు ఇతర పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఈవో పేర్కొన్నారు.

News November 9, 2025

పాడి పశువుల పాలలో కొవ్వు శాతం ఎందుకు తగ్గుతుంది?

image

గేదె, ఆవు పాలకు మంచి ధర రావాలంటే వాటిలో కొవ్వు శాతం కీలకం. పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. పశువులను మరీ ఎక్కువ దూరం నడిపించినా, అవి ఎదలో ఉన్నా, వ్యాధులకు గురైనా, మేతను మార్చినప్పుడు, పచ్చి, ఎండుగడ్డిని సమానంగా ఇవ్వకున్నా పాలలో వెన్నశాతం అనుకున్నంత రాదు.✍️ వెన్నశాతం పెంచే సూచనలకు <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.