News February 1, 2025
FEB 20లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్- 2020లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 26, 2025
కంది: పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో

కంది మండలం కాశీపూర్ కేజీబీవీ పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. 100% ఫలితాలు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రత్యేక అధికారి ఉన్నారు.
News November 26, 2025
ఏలూరు: మంత్రి నాదెండ్లకు ZP ఛైర్పర్సన్ రిక్వెస్ట్

ఏలూరు రెవెన్యూ అతిథి భవనంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ను బుధవారం జడ్పీ చైర్పర్సన్ గంట పద్మశ్రీ కలిశారు. ఇటీవలి భారీ వర్షాలు, తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల పరిస్థితిని ఆమె వివరించారు. అత్యవసర మరమ్మతు పనుల కోసం, ముఖ్యంగా పంచాయతీరాజ్ రహదారుల పునరుద్ధరణకు తగిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
News November 26, 2025
సంగారెడ్డి: ప్రజలకు న్యాయ సహాయం అందిస్తున్నాం: జిల్లా జడ్జీ

ప్రజలకు వివిధ సంస్థల ద్వారా న్యాయ శాఖ అందిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా కోర్టులో జాతీయ న్యాయ దినోత్సవ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జాతీయలోక్ అదాలత్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.


