News February 1, 2025

FEB 20లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

image

లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్- 2020లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 19, 2025

రేప్‌లు చేసి.. కుంభమేళాకు వెళ్తుండగా!

image

రేప్‌ చేసి జైలుకెళ్లడం, తిరిగొచ్చి మళ్లీ అదే క్రైమ్ చేసే ఓ వ్యక్తి మహాకుంభమేళాకు వెళ్తూ దొరికిపోయాడు. MPకి చెందిన రమేశ్ సింగ్ 2003లో 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసి పదేళ్లు జైలుకెళ్లొచ్చాడు. 2014లో 8ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసి టెక్నికల్ ఆధారాలు లేక 2019లో జీవితఖైదు శిక్ష నుంచి బయటపడ్డాడు. తాజాగా, FEB 2న 11ఏళ్ల బాలికపై హత్యాచారం చేశాడు. ఆపై ప్రయాగ్‌రాజ్ వెళ్తుండగా జైపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

News February 19, 2025

శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమం

image

శంకరపట్నం మండలం కొత్తగట్టు జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. స్థానికుల తెలిపిన వివరాలిలా.. హుజురాబాద్ నుంచి కొత్తగట్టు వెళ్తున్న బైకర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్ కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 19, 2025

‘మిస్టర్ యోగి.. ఆ నీటిని తాగి చూపించు’.. ప్రశాంత్ భూషణ్ సవాల్

image

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నీటిలో ఫేకల్ బ్యాక్టీరియా ఉందన్న CPCB రిపోర్ట్ సంచలనంగా మారింది. ఈ నివేదికను యూపీ సీఎం యోగి <<15514963>>ఖండించారు.<<>> ఆ నీరు తాగొచ్చని కూడా ప్రకటించారు. దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సీఎంకు సవాల్ విసిరారు. ‘యోగి, ఆయన మంత్రివర్గానికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మహా కుంభమేళాలో ఓ గ్లాస్ నీటిని తాగి చూపించండి’ అని ఛాలెంజ్ చేశారు.

error: Content is protected !!