News February 3, 2025
ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు

✒ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్బర్గ్ మరణం
✒ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
✒ 1963: RBI 23వ గవర్నర్ రఘురాం రాజన్ జననం
✒ 1954: UP మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 800 మంది మృతి
✒ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
✒ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం
Similar News
News October 21, 2025
రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 5,810 NTPC పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. వయసు పోస్టులను బట్టి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పూర్తై ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News October 21, 2025
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని చెప్పారు.
News October 21, 2025
ఏపీ, తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*సీపీఐ ఏపీ కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నిక
*TTD గోశాలలో గోవుల మృతిపై భూమన కరుణాకర్ ఆరోపణలు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు
*నిజామాబాద్లో రియాజ్ ఎన్కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల సంఘం. నవంబర్ 24లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
*భీమవరం డీఎస్పీపై ప.గో. ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ ఫిర్యాదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని సూచన