News February 12, 2025

ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు

image

1713: మొఘల్ చక్రవర్తి జహందర్ షా మరణం
1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
1809: అమెరికా 16 వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
1962: సినీ నటుడు జగపతిబాబు జననం
1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం

Similar News

News February 12, 2025

త్వరలో గూగుల్ మెసేజెస్ యాప్ నుంచే వాట్సాప్ కాల్స్!

image

గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా WhatsApp వీడియో కాల్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా Google meet వీడియో కాల్స్ మాత్రమే చేసుకునేందుకు వీలుంది. అయితే యాప్స్‌ను స్విచ్ చేసుకునే బదులు, యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ తీసుకొస్తోంది. తొలుత వన్ ఆన్ వన్ కాల్స్‌కు మాత్రమే ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ అయి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది.

News February 12, 2025

నేడే మూడో ODI.. జట్టులోకి పంత్, అర్ష్‌దీప్?

image

ఇండియా, ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. IND తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. ఈ పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు కఠినంగా, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, డ్యూ కూడా వచ్చే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. sports 18-2, హాట్‌స్టార్‌లో మ.1.30 నుంచి లైవ్ చూడవచ్చు. WAY2NEWSలో లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.

News February 12, 2025

అధికారులు ప్రతినెలా 3-4 జిల్లాల్లో తిరగాలి: సీఎం

image

AP: గ్రూప్-1 అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!