News February 15, 2025
ఫిబ్రవరి 15: చరిత్రలో ఈరోజు

1564: ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జననం
1739: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జననం
1964: సినీ దర్శకుడు, నిర్మాత అశుతోశ్ గోవారికర్ జననం
1982: సినీ నటి మీరా జాస్మిన్ జననం
Similar News
News December 3, 2025
ధర్మశాస్తా దర్శనం: ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే?

అయ్యప్ప స్వాములు ఇరుముడితో 18 మెట్లు దాటిన తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శిస్తారు. అనంతరం మణి మండపం, మహా గణపతి, సర్పరాజు వద్ద ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత చిన్ముద్ర ధారియైన అయ్యప్ప దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుంటారు. ఆ స్వరూపాన్ని గుండెల్లో నింపుకొని, ఇరుముడిని స్వామికి చూపిస్తారు. నెయ్యభిషేకం చేయిస్తారు. చివరగా మాలికపురత్తమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. <<-se>>#AyyappaMala<<>>
News December 3, 2025
మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.
News December 3, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.


