News February 17, 2025
ఫిబ్రవరి 17: చరిత్రలో ఈరోజు

1883: స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే మరణం
1954: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జననం
1963: అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ జననం
1983: సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు మరణం
1984: క్రికెట్ ప్లేయర్ డివిలియర్స్ జననం
1984: సినీ నటి సదా జననం
1986: తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం
2000: మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 ఓఎస్ విడుదల
Similar News
News February 3, 2026
TODAY HEADLINES

* భారత సరిహద్దుల్లోకి చైనా చొరబడుతోంది: రాహుల్
* రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రుల అభ్యంతరం
* HYD TO BLR.. 2 గంటల్లో వెళ్లొచ్చు: అశ్వినీ వైష్ణవ్
* లా అండ్ ఆర్డర్ సమస్యకు YCP యత్నం: CBN
* లోకేశ్ నన్ను హతమార్చాలని చూస్తున్నారు: జోగి
* TG: మున్సి‘పోల్స్’’: 19,608 నామినేషన్లు ఓకే
* సిట్ విచారణ.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
* భారత్‌పై టారిఫ్‌లను 25%-18 శాతానికి తగ్గించిన అమెరికా
News February 3, 2026
ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం

భారత్‌పై ప్రతీకార టారిఫ్‌లను 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున అమెరికా అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ప్రపంచశాంతికి ట్రంప్ నాయకత్వం కీలకమని xలో ట్వీట్ చేశారు.
News February 3, 2026
భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం: ట్రంప్

భారత్‌పై టారిఫ్‌ల తగ్గింపునకు ప్రతిఫలంగా.. అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకొస్తుందని ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, వ్యవసాయ, బొగ్గు, సాంకేతిక ఉత్పత్తుల కొనుగొలుకు మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. దీని వల్ల భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆయన ఆకాంక్షించారు.


