News March 1, 2025
ఫిబ్రవరి GST కలెక్షన్స్ @ రూ.1.84లక్షల కోట్లు

ఫిబ్రవరిలో స్థూల GST వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థానిక రాబడి 10.2% ఎగిసి రూ.1.42లక్షల కోట్లు, దిగుమతులపై రాబడి 5.4% ఎగిసి రూ.41,702కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో CGST రూ.35,204 కోట్లు, SGST రూ.43,704 కోట్లు, IGST రూ.90,870 కోట్లు, సెస్ రూ.13,868 కోట్లు. ఇక రూ.20,889 కోట్లు రీఫండ్ చెల్లించగా నికర GST రూ.1.63లక్షల కోట్లుగా తేలింది. 2024 FEBలో ఇది రూ.1.50 లక్షల కోట్లే.
Similar News
News March 1, 2025
కనిపించిన నెలవంక.. రేపటి నుంచి పవిత్రమాసం

భారత్‌లో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపటి నుంచి రంజాన్ పవిత్రమాసం ప్రారంభం కానుంది. ఈ సమయంలో నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో తమ సంపదలో కొంత భాగాన్ని పేదలకు దానం చేస్తారు. సౌదీ అరేబియాలో నిన్ననే చంద్రవంక దర్శనమివ్వగా నేటి నుంచి రంజాన్ మొదలైన సంగతి తెలిసిందే. కాగా రంజాన్ మాసంలో తెలంగాణలోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ వేళల్లో వెసులుబాటు కల్పించింది.
News March 1, 2025
తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని లేఖ

AP: ఇటీవల తిరుమల కొండపై పలుమార్లు విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్ర నిబంధనల దృష్ట్యా నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
News March 1, 2025
CT: సెమీస్ చేరిన జట్లివే

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-A నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు, గ్రూప్-B నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరాయి. రేపు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీస్‌లో ఏ జట్లు పోటీ పడతాయనేది తేలనుంది.