News March 4, 2025
75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్

AP: విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్‌మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపింది.
Similar News
News April 2, 2026
భీమవరంలో సంబరాలు

అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించడంతో జిల్లావ్యాప్తంగా గురువారం పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజధాని ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
News April 2, 2026
గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్

TG: గ్రూప్-1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలో అక్రమాలు కనిపించలేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభ్యర్థులు SCని ఆశ్రయించారు. ఈ క్రమంలో TGPSCలో అక్రమాలు జరగలేదని, నియామకాలు సరిగ్గానే జరిగాయని పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది.