News September 12, 2024
ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల కట్టడికి కమిటీ?

TG: ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ధారణ, నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లలో అభ్యర్థుల భద్రత, ఫీజులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు తగ్గడంపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు: KTR

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో <<18592868>>స్పీకర్ నిర్ణయం<<>> ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. న్యాయస్థానాలపై, రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌కు ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందన్నారు. కేవలం ఫోటోలకు పోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని ఎద్దేవా చేశారు. <<18593829>>ఉపఎన్నికలు<<>> వస్తే ఓడిపోతామని కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
News December 17, 2025
ప్రజల ప్రాణాలతో CBN చెలగాటం: సజ్జల

AP: ప్రజల ప్రాణాలతో CM చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల ప్రతులను పరిశీలించారు. పీపీపీ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. ప్రైవేటులో ఫ్రీగా వైద్యం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం చేసిన అప్పుల్లో కొంత ఖర్చు చేసినా కాలేజీలు పూర్తవుతాయన్నారు.
News December 17, 2025
నాలుగో టీ20కి స్టార్ ప్లేయర్ దూరం!

దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కి భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ దూరమైనట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాలి వేలికి గాయం కావడంతో ఆయన మ్యాచ్ ఆడట్లేదని వెల్లడించాయి. కాగా తొలి మూడు టీ20ల్లోనూ గిల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు. అటు పొగమంచు కారణంగా ఇవాళ్టి మ్యాచ్ టాస్‌పై అంపైర్లు 7.30pmకి నిర్ణయం తీసుకోనున్నారు.


