News January 5, 2025
ఫస్ట్ INGలోనే అసౌకర్యంగా అనిపించింది: బుమ్రా
ఐదో మ్యాచ్ ఫలితం తనను నిరాశకు గురి చేసిందని భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు. కీలక సమయంలో బౌలింగ్ చేయలేకపోయినందుకు ఇంకాస్త బాధగా ఉందని చెప్పారు. మనం శరీరానికి గౌరవం ఇవ్వాలని, దాంతో పోరాడలేం అని చెప్పారు. శరీరం బాగుంటేనే ఏదైనా చేయగలుగుతామన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడే వెన్నునొప్పితో అసౌకర్యంగా అనిపించిందని, దానిపై మెడికల్ టీంతో చర్చించి స్కానింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు.
Similar News
News January 7, 2025
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS వర్తింపు
AP: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకూ EHS ద్వారా వైద్య సేవలు పొందే అవకాశాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గతంలో రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి భాగస్వామికి EHSలో వైద్య సదుపాయం ఉండేది. 2020లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక ఈ సదుపాయం లేకుండా పోయింది. దీనిపై ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
News January 7, 2025
టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు!
AP: మెరుగైన పనితీరు కనబరిచిన టీచర్లకు పాయింట్ల ఆధారంగా గుర్తింపు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా తీసుకురాబోయే బదిలీల చట్టంలో దీని ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. ప్రోత్సాహం లేకపోతే పనిలో పోటీ ఉండదని విద్యాశాఖ భావిస్తోంది. అటు బదిలీలకు విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పాయింట్ల విధానం కచ్చితంగా అమలు చేస్తారా? అనేదానిపై స్పష్టత లేదు.
News January 7, 2025
శ్రీతేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఇవాళ కిమ్స్ ఆస్పత్రికి ఆయన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్తే ముందే తమకు సమాచారం ఇవ్వాలని ఆయనకు పోలీసులు <<15079293>>నోటీసులు<<>> ఇచ్చిన సంగతి తెలిసిందే.