News April 14, 2025

పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

TG: సంబంధాలు కుదరక పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. జనగామ (D) కొడకండ్ల (M) నీలిబండతండాకు చెందిన గగులోత్ నీల(26)కు 2020లో AR కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వరంగల్‌లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో తమ కూతురు సూసైడ్ చేసుకున్నట్లు నీల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 27, 2025

నేడు CWC కీలక భేటీ

image

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు. ఈ భేటీలో ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై ముఖ్యంగా చర్చించే అవకాశముంది. అలాగే త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ స్ట్రాటజీ ఖరారు చేయనున్నట్లు సమాచారం.

News December 27, 2025

పెద్ద దానం చేస్తే ఎక్కువ ఫలం ఉంటుందా?

image

దానం ఎంత పెద్దది అనే దాని కంటే, ఎంత తృప్తిగా చేశామన్నదే ముఖ్యం. భక్తితో చేసే చిన్న సాయమైనా ఎంతో పుణ్యాన్నిస్తుంది. శక్తికి మించి దానం చేయాల్సిన అవసరం లేదు. స్తోమతను బట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి తోడ్పడటం ఎంతో గొప్పది. స్వార్థం లేని త్యాగం, దయాగుణంతో ఇచ్చే పిడికెడు ధాన్యమైనా.. అది దైవదృష్టిలో గొప్ప దానంగా పరిగణిస్తారు. ప్రేమతో చేసే చిన్న సాయం జీవితంలో వెలుగు నింపుతుంది.

News December 27, 2025

జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

image

AP: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో 4-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోనూ చలి పెరిగింది. ఉత్తర భారతం నుంచి గాలులు, హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు వల్ల శీతల తరంగాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో చలి పెరిగిందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం మరింత పెరిగే ఆస్కారముందని అంచనా వేస్తున్నారు.