News November 15, 2024
మహిళా ఎంపీ గొప్ప మనసు.. పేద బాలికల కోసం!

NDAలో యంగెస్ట్ ఎంపీగా పేరొందిన శాంభవి చౌదరి తన ఐదేళ్ల జీతాన్ని అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘చదువుకుంటేనే సమస్తిపూర్ వృద్ధి చెందుతుంది’ అనే నినాదంతో ఆమె తన శాలరీని ఖర్చు పెట్టనున్నారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Similar News
News October 22, 2025
2,570 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RRB 2,570 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.rrbapply.gov.in
News October 22, 2025
జైషే మహ్మద్ మరో కుట్ర?

పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏర్పాటైన <<17958042>>మహిళా వింగ్ <<>>కోసం రిక్రూట్మెంట్, నిధులు సేకరించేందుకు ఆన్లైన్ జిహాదీ కోర్స్ ప్రారంభించినట్లు సమాచారం. జైషే చీఫ్ మసూద్ సిస్టర్స్ సాదియా, సమైరా, మరికొందరు రోజూ 40నిమిషాలు పాఠాలు చెప్తారని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేవారు 500 పాక్ రుపీస్ డొనేషన్ ఇవ్వాలంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
News October 22, 2025
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించారా?

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. నవంబర్ 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పాడిరైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.