News November 30, 2024
ఫెంగల్ తుఫాన్: అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

AP: ఫెంగల్ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచించారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు.
Similar News
News November 25, 2025
బలవంతపు వాంతులతో క్యాన్సర్: వైద్యులు

బ్రష్ చేశాక చాలా మంది గొంతులోకి వేళ్లు పెట్టి బలవంతంగా వాంతులు చేసుకుంటారు. అలా పదే పదే చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కడుపులోని యాసిడ్ పదేపదే పైకి తన్నడం వల్ల అన్నవాహికలోని ‘టైల్స్’ లాంటి సున్నితమైన కణాలు అరిగిపోతాయి. ఇలా మాటిమాటికీ జరిగితే తీవ్రమైన సందర్భాల్లో క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుకను గీసుకొని ముఖం కడుక్కుంటే చాలు’ అని సూచించారు.
News November 25, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మరోవైపు మలక్కా జలసంధి వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో NOV 29 నుంచి DEC 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News November 25, 2025
ఆంధ్ర అరటికి.. ఆజాద్పుర్ మండీ వ్యాపారుల హామీ

AP: అరటి ధర పతనంతో కొందరు రైతులు పండిన పంటను చెట్లకే వదిలేశారు. మరి కొందరు పశువులకు మేతగా వేశారు. ఈ తరుణంలో AP నుంచి నాణ్యమైన అరటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీలోని ఆజాద్పుర్ మండీ పండ్ల వ్యాపారులు హామీ ఇచ్చారు. AP అధికారులు నిన్న ఢిల్లీలో ‘బయ్యర్ సెల్లర్స్ మీట్’ నిర్వహించి అక్కడి వ్యాపారులతో చర్చించగా.. 10-15 రోజుల్లో AP నుంచి అరటిని కొంటామని ఆజాద్పుర్ మండీ వ్యాపారులు హామీ ఇచ్చారు.


