News February 24, 2025
ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా

AP: ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని ప్రకటించారు. కాగా ఫైబర్నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం.
Similar News
News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరేనా?

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున భారీగా ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు ఖాళీలకుగానూ టీడీపీ నుంచి కేఎస్ జవహర్, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి.
News February 24, 2025
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు: చంద్రబాబు

AP: భవిష్యత్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్లలో క్యూఆర్ కోడ్ ఉంచాలి. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. బెల్టు షాపులు ఎక్కడ ఉన్నా ఉపేక్షించొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.
News February 24, 2025
కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి UP వెళ్లిన AP బృందం

AP: 2027లో రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో రాష్ట్ర బృందం అధ్యయనం చేస్తోంది. మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్గ్ సహా పలువురు కుంభమేళాను సందర్శించారు. ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ క్లియరెన్స్, భద్రతా చర్యల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.