News February 24, 2025
ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు

AP: ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్ కుమార్‌పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని దినేశ్ కుమార్‌ను ఆదేశించింది. మరోవైపు ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కాగా ఫైబర్‌నెట్‌కు చెందిన పూర్తి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ఎండీని జీఏడీకి అటాచ్ చేసినట్లు సమాచారం.
Similar News
News December 5, 2025
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వండి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ నిధికి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు. గోడపత్రికపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సులభంగా విరాళాలను జమ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.


