News October 22, 2024
టీమ్‌ఇండియాలో తీవ్ర పోటీ.. అసిస్టెంట్ కోచ్ ఏమన్నారంటే?

భారత టెస్టు జట్టులో మిడిలార్డర్ కోసం పోటీ ఎక్కువగా ఉందని అసిస్టెంట్ కోచ్ డస్కాటే అన్నారు. ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ పడుతున్నారని, పిచ్‌ను బట్టి జట్టును సెలక్ట్ చేస్తామని చెప్పారు. ‘గిల్ ఫిట్‌గా ఉన్నారు. పంత్ గాయం నుంచి కోలుకున్నారు. సర్ఫరాజ్ తొలి టెస్టులో భారీ స్కోర్ చేశారు. KL రాహుల్ మానసికంగా బలంగా ఉన్నారు. ప్లేయర్లందరికీ మా మద్దతు ఉంటుంది. జట్టు ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని మీడియాకు తెలిపారు.
Similar News
News March 17, 2025
పెళ్లైన మగవారు బరువు ఎందుకు పెరుగుతారంటే?

వివాహం తర్వాత పురుషులు అనూహ్యంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెళ్లైన ఆనందంలో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లి కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. బాధ్యతలు పెరిగి జిమ్‌కు వెళ్లే సమయం ఉండదు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగిపోతారు. హార్మోన్ల మార్పుల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి మరో కారణం.
News March 17, 2025
రూ.400కోట్లు పన్నులు చెల్లించాం: శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

మహాకుంభమేళా సమయంలో కోటి 26లక్షల మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. గత ఐదేళ్లలో రూ. 400కోట్ల పన్నులు ప్రభుత్వానికి చెల్లించినట్లు కార్యదర్శి వెల్లడించారు. అయోధ్యకు వచ్చే భక్తులు, పర్యాటకులు సంఖ్య 10రెట్లు పెరిగిందని, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. గతేడాది 5కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
News March 17, 2025
కూతురితో రోహిత్ శర్మ CUTE PHOTOS

IPL 2025కు ముందు దొరికిన కాస్త విరామాన్ని రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులు టూర్‌లో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా కూతురు సమైరాతో దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని షేర్ చేస్తూ CUTE PHOTO అంటూ కామెంట్లు చేస్తున్నారు.