News November 24, 2024

తెలుగు టైటాన్స్‌కు ఐదో పరాజయం

image

ప్రో కబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 31-28 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. TTలో విజయ్ 15 పాయింట్లు, గుజరాత్‌లో ప్రతీక్ 11 పాయింట్లు సాధించారు. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో హరియాణా స్టీలర్స్ కొనసాగుతోంది.

Similar News

News January 22, 2026

సన్ గ్లాసెస్‌తో మాక్రాన్.. కారణమదేనా?

image

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ సన్‌గ్లాసెస్ ధరించడం చర్చనీయాంశమైంది. కంటి సమస్య(రక్తం గడ్డకట్టడం) వల్లే ఆయన గ్లాసెస్ ధరించారని ఫ్రెంచ్ మీడియా చెబుతుండగా తగ్గేదేలే అంటూ ట్రంప్‌నకు ఆయన మెసేజ్ ఇచ్చారేమోనని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. తాజాగా <<18905776>>ట్రంప్<<>> దీనిపై WEFలో మాట్లాడుతూ ‘మాక్రాన్ బ్యూటిఫుల్ గ్లాసెస్ ధరించి కనిపించారు. అసలేం జరిగింది?’ అని వెటకారంగా అన్నారు.

News January 22, 2026

భారత ప్లేయర్‌కు గాయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో టీమ్ ఇండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డారు. 16వ ఓవర్లో మిచెల్ కొట్టిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆయన వేలికి గాయమైంది. చేతి నుంచి రక్తం రావడంతో నొప్పితో మైదానాన్ని వీడారు. గాయం తీవ్రత ఎక్కువైతే తర్వాతి మ్యాచుల్లో అక్షర్ ఆడేది అనుమానమే.

News January 21, 2026

నాకు ఆ చిన్న ఐస్ ముక్క చాలు.. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్

image

దావోస్‌ వేదికగా నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేను కేవలం ఒక ఐస్ ముక్క మాత్రమే అడుగుతున్నాను. ఇందుకు నో అనేవారిని అస్సలు మర్చిపోను’ అని హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడానికి ఫోర్స్‌ను కూడా ఉపయోగించనంటూ పరోక్ష బెదిరింపులకు దిగారు. ఆ ప్రాంతాన్ని కాపాడడం తమకే సాధ్యమని, ఇంకెవరూ ఆ పని చేయలేరని చెప్పుకొచ్చారు.