News March 4, 2025
ఐదో రౌండ్ పూర్తి: ముందంజలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకెళ్తున్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి 7,142 ఓట్ల ముందంజలో ఉన్నారు. అంజిరెడ్డికి 38,553, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 31,411, ప్రసన్న హరికృష్ణ (బీఎస్పీ) 26,300 ఓట్లు సాధించారు.
Similar News
News October 21, 2025
ఒంబ్రొఫోబియా: వర్షం అంటే వణుకే!

కొందరికి వర్షం అంటే భయం. దాన్ని ఒంబ్రొఫోబియా అంటారు. పిల్లలు, టీనేజర్లకు ఈ ఫోబియా ఎక్కువగా ఉంటుంది. వీరు పదే పదే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుంటారు. వర్షం పడితే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇంటినుంచి బయటకు వెళ్లరు. వర్షం ఆగినా కొన్ని గంటల పాటు ఇంటికే పరిమితమవుతారు. గుండె దడ, వణుకు, భయం, ఛాతినొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫోబియాకు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
News October 21, 2025
అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు

AP: అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశమున్న మిగతా జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్, స్టూడెంట్స్ కోరుతున్నారు.
News October 21, 2025
ఆయన భారత్‌ను ఎంచుకున్నారు.. లోకేశ్ ట్వీట్ వైరల్!

AP: వైజాగ్‌లో $15B పెట్టుబడులతో గూగుల్ డేటా-Ai హబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులో అధికార DMK, ప్రతిపక్ష AIADMK మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గూగుల్‌ను TNకు తీసుకురావడంలో CM స్టాలిన్ ఫెయిలయ్యారని, తమిళుడైన గూగుల్ CEO పిచయ్ APని ఎంచుకున్నారని AIADMK చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఆయన భారత్‌ను ఎంచుకున్నారు’ అంటూ హుందాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.