News April 21, 2025

హిందీకి వ్యతిరేకంగా పోరాడండి: ఉదయనిధి

image

కేంద్రం NEET, NEP పేరుతో తమిళ విద్యావ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని తమిళనాడు Dy.CM ఉదయనిధి స్టాలిన్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావమే తమిళ భాషతో జరిగిందని చెన్నైలోని ఓ కళాశాలలో జరిగిన సభలో ప్రసంగించారు. 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఎంతోమంది నిస్వార్థంగా పోరాడి తమిళ భాషను రక్షించారని, ఇప్పుడు ఆ బాధ్యత తీసుకొని హిందీకి వ్యతిరేకంగా నిరసన చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Similar News

News August 7, 2025

సిరాజ్, ప్రసిద్ధ్‌లకు కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్

image

ICC తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్‌లు కెరీర్ బెస్ట్ ర్యాంకులను పొందారు. సిరాజ్ 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకులో, ప్రసిద్ధ్ 25 స్థానాలు ఎగబాకి 59th ర్యాంకులో నిలిచారు. బుమ్రా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ 5, పంత్ 8, గిల్ 13వ స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా తొలి స్థానంలో, సుందర్ 16వ స్థానంలో ఉన్నారు.

News August 7, 2025

వచ్చే వారంలో ట్రంప్, పుతిన్ భేటీ!

image

US ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ తొలుత పుతిన్‌తో వ్యక్తిగతంగా సమావేశమవుతారని, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి రష్యాతో సీజ్ ఫైర్‌పై చర్చిస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘రష్యన్లు ట్రంప్‌ను కలవాలనుకుంటున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు’ అని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.

News August 7, 2025

AP న్యూస్ రౌండప్

image

☞ విశాఖలో రూ.35Crతో 5 ఎకరాల్లో థీమ్ పార్క్ ఏర్పాటు: మంత్రి దుర్గేశ్
☞ CM స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక్క <<17326231>>జడ్పీటీసీ<<>> స్థానం కోసం ఇంతగా దిగజారిపోతారా: YS జగన్
☞ స్కూళ్లలో ఈ నెల 11 నుంచి ఫార్మెటివ్-1 పరీక్షలు
☞ సర్పంచ్, MPTC ఉప ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల్లో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత
☞ ఈ నెల 24న గ్రామ సర్వేయర్లకు శాఖాపరమైన పరీక్షలు