News April 14, 2024
రూ.50 కోసం గొడవ.. వేలిని కొరికేశాడు

ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. బాందా జిల్లాలో శివ చంద్ర బట్టల దుకాణానికి వెళ్లిన ఓ కస్టమర్ ఫ్రాక్ కొన్నాడు. అది సైజ్ సరిపోకపోవడంతో మరుసటి రోజు ఆ దుకాణానికి వెళ్లి కొంత పెద్ద సైజు ఇవ్వాలని అడిగాడు. దుకాణ యజమాని రూ.50 అదనంగా చెల్లించాలని కోరారు. చెల్లించబోనన్న కస్టమర్ అతడితో గొడవకు దిగి చివరికి దుకాణదారుడి ఎడమచేతి వేలిని కొరికేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారవ్వగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News March 4, 2026
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,568 పాయింట్లు కుంగి 78,669 వద్ద, నిఫ్టీ 476 పాయింట్లు క్షీణించి 24,388 దగ్గర ట్రేడవుతోంది. ఇన్ఫీ, BEL, HCL టెక్ షేర్లు లాభాల్లో.. LT, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, M&M, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92 మార్క్ దాటి ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది.
News March 4, 2026
ఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది

TG: నాగర్‌కర్నూల్‌లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) ఈనెల 2న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడే బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. KGBVలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.
News March 4, 2026
జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

ర్యాపిడో తన ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను బెంగళూరు వ్యాప్తంగా ప్రారంభించింది. గత 7 నెలలుగా కోరమంగళ, HSR లేఅవుట్ వంటి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జొమాటో, స్విగ్గీలు రెస్టారెంట్ల నుంచి 16-30% వరకు కమీషన్ వసూలు చేస్తుంటే ‘ఓన్లీ’ మాత్రం వారి నుంచి ₹400 కంటే తక్కువ ఆర్డర్లకు ₹25, ఎక్కువ వాటికి ₹50 ఫిక్స్‌డ్ ఫీజు కలెక్ట్ చేయనుంది.


