News July 4, 2024
ఫైళ్లను YCP ఆఫీస్లో తగలబెట్టామా?: పేర్ని

AP: పీసీబీ, ఏపీఎండీసీ ఫైళ్లు తగలబెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న విషయం మర్చిపోయారా అని టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. అవసరమైతే సీబీఐ, సీఐడీతో విచారణ చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఫైళ్లను ఏమైనా వైసీపీ కార్యాలయంలో తగలబెట్టామా అని ఆయన నిలదీశారు.
Similar News
News November 13, 2025
ఆ సినిమాలు చూసి నన్ను చంపాలనుకున్నారు: అదా శర్మ

రిస్క్ ఉన్న క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని, నటించినప్పుడే కెరీర్కు విలువ పెరుగుతుందని హీరోయిన్ అదా శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ది కేరళ స్టోరీ, బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలు రిలీజైన తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగిలిన వారు ప్రశంసించారు. వాళ్లే నన్ను కాపాడారు. నేను యాక్షన్, భావోద్వేగం, రిస్క్ ఉన్న స్క్రిప్ట్నే ఎంపిక చేసుకుంటా’ అని చెప్పారు.
News November 13, 2025
CBN గారూ.. మీ ‘క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుంది: జగన్

AP: క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ CM CBNపై YCP అధినేత జగన్ విమర్శలకు దిగారు. ‘YCP హయాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను మేమే కట్టేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మీ క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది. 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లూ మంజూరు చేయించలేదు. 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87వేల ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు కట్టించినవే’ అని ట్వీట్ చేశారు.
News November 13, 2025
వంటింటి చిట్కాలు

* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* బియ్యం పురుగు పట్టకూడదంటే కరివేపాకులు వేయాలి.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.
* నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
* చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడిపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.


